HomeTelugu Trending'వాల్మీకి' కోసం భారీ పారితోషికం డిమాండ్‌ చేసిన పూజా హెగ్డే!

‘వాల్మీకి’ కోసం భారీ పారితోషికం డిమాండ్‌ చేసిన పూజా హెగ్డే!

10 2‘ఒక లైలా కోసం..’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్‌ పూజా హెగ్డే తర్వాత వరుణ్‌తేజ్‌ సరసన ‘ముకుంద’ చిత్రంలో నటించారు. ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’ తర్వాత ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు లభించాయి. మహేశ్‌బాబు సరసన పూజ నటించిన ‘మహర్షి’ మే 9న విడుదల కాబోతోంది. కాగా ‘వాల్మీకి’ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం చిత్ర బృందం పూజను సంప్రదించినట్లు సమాచారం. ఇందులో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందట. కేవలం 15 రోజుల షూటింగ్‌కు ఆమె భారీ మొత్తం డిమాండ్‌ చేసినట్లు పలు ఆంగ్ల వెబ్‌సైట్లు పేర్కొన్నాయి. 15 రోజులు షూట్‌లో పాల్గొనేందుకు పూజ రూ.2 కోట్లు పారితోషికంగా అడిగినట్లు చెబుతున్నారు. ‘వాల్మీకి’ చిత్ర నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట అంత మొత్తం ఇవ్వడానికి వెనకాడలేదట. ఆమెకు రూ.2 కోట్లు ఇవ్వడానికి వారు అంగీకరించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు వివరాల్ని ప్రకటించనున్నారు.

‘వాల్మీకి’ సినిమాకు హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్‌ గుబురు గడ్డంతో కొత్త లుక్‌లో సిద్ధమయ్యారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!