స్కూల్ డ్రెస్‌లో పూజ హెగ్డే .. ఫొటో వైరల్‌

హీరోయిన్ పూజ హెగ్డేకు యువతలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సౌత్ కుర్రకారుకు ఈమె డ్రీమ్ గర్ల్. అందుకే ఆమెకు సంబందించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా వైరల్ అయిపోతోంది. ఎలా బయటికి వచ్చిందో తెలీదు కానీ పూజా స్కూల్ డ్రెస్‌ పిక్ ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అందులో గోల ఐస్క్రీమ్ తింటూ ఫోజిచ్చింది పూజా. ఇంకేముంది కొద్దిసేపట్లోనే ఆ ఫోటోకు బోలెడు లైకులు, షేర్లు. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సీనియాలో, ప్రభాస్, రాధాకృష్ణలు చేస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ రెండూ కాక హిందీలో కూడా ఒక సినిమా చేస్తోంది పూజా హెగ్డే.