
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈసినిమాలో మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. కేఎస్ రవింద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా రవితేజ, చిరంజీవి కలిసి స్టెప్పులేసిన ‘పూనకాలు లోడింగ్’ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.
లేటెస్ట్‌గా రిలీజైన ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. చిరంజీవి, రవితేజ కలిసి ఒకే ఫ్రేమ్‌లో స్టెప్పులేయడం అభిమానులకు నిజంగానే పూనకాలు తెప్పిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ స్వర పరిచిన ఈ పాటను రోల్ రైడా, రామ్ మిర్యాలతో కలిసి దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించాడు. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన మూడు పాటలు చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లో ‘పూనకాలు లోడింగ్’ పాట కూడా చేరింది. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.













