పూనమ్‌ కౌర్‌ను మానసికంగా వేధిస్తున్నారట


సోషల్‌ మీడియాల్లో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ సినీనటి పూనమ్‌ కౌర్‌ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో గుర్తు తెలియని కొందరు మానసికంగా తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై వేధింపులకు పాల్పడిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. నిందితులను పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారనే విశ్వాసం తనకు ఉందన్నారు. తనకు జరిగినట్టు వేరే అమ్మాయికి జరగకూడదని కోరుకుంటున్నానన్నారు. ఎవరు చేస్తున్నారో, ఏ లబ్ధి పొందాలని చేస్తున్నారో తనకు అర్థం కావడంలేదని చెప్పారు. నిందితులెవరైనా కచ్చితంగా వారికి శిక్షపడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని పూనమ్‌ కౌర్‌ కోరారు.