HomeTelugu Trendingభర్తపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన పూనమ్‌ పాండే..

భర్తపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన పూనమ్‌ పాండే..

Poonam pandey gets husband
బాలీవుడ్ నటి,మోడల్ పూనమ్ పాండే మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన భర్త తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అంతే కాకుండా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం పూనమ్ గోవా కి దగ్గర్లోని ఓ విలేజ్ లో సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే ఆమె తన భర్తపై ఫిర్యాదు చేసింది. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై తుకారం ఆమె భర్త సామ్ బాంబే ను అరెస్ట్ చేశామని అన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమెకు మెడికల్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా పూనమ్ పాండే తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబే ను పెళ్లి చేసుకుని ఇంకా నెల రోజులు కూడా పూర్తికాలేదు. ఈ నెల 1న పెళ్లి చేసుకున్న పూనమ్-సామ్ బాంబే జంట నెల రోజులు పూర్తి కాకముందే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం గమనార్హం. ఈ నెల 10న పూనమ్ తన భర్తతో కలిసి ఉన్న పెళ్లి ఫోటోలను షేర్ చేసి మిస్టర్ అండ్ మిసెస్ బాంబే అంటూ కాప్షన్ కూడా పెట్టింది. ఇక ఈ విషయంపై నెటిజన్లు పలురకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!