ప్రముఖ సీనియర్‌ నటుడు మృతి

ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు రాజు డానియెల్‌ అలియాస్‌ ‘కెప్టెన్‌ రాజు’ కన్నుమూశారు. 68 సంవత్సరాల కెప్టెన్‌ రాజు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం కోచ్చిలోని తన ఇంట్లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ కలిగిన రాజు 1981లో ‘రక్తం’ అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తరవాత పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎదిగారు.

తెలుగులో బలిదానం, శత్రువు, రౌడి అల్లుడు, కొండపల్లి రాజా, జైలర్‌ గారి అబ్బాయి, గాండీవం, మొండి మొగుడు పెంకి పెళ్లాం, మాతో పెట్టుకోకు, వంటి చిత్రాల్లో నటించారు. మలయాళంలో 1997లో తొలిసారి ఒరు స్నేహగథా చిత్రంతో దర్శకుడిగా మారారు. అనంతరం 2012లో పవనాయి 99. 99 చిత్రానికి దర్శకత్వ వహించడమే కాక ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మొత్తం 500 సినిమాల్లో నటించారు కెప్టెన్‌ రాజు.