ప్రభాస్‌కు ఎప్పుడో చెప్పాం.. అంటున్న మీల్కీ బ్యూటీ

హీరోయిన్‌ తమన్నా.. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ప్రారంభించమని తన సహ నటుడు ప్రభాస్‌కు ఎప్పుడో చెప్పామని అన్నారు. ఎట్టకేలకు ఆయన ఖాతా ప్రారంభించడం సంతోషంగా ఉందని ఓ ఆంగ్లపత్రికతో చెప్పారు. ప్రభాస్‌ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. ఫాలోవర్స్ సంఖ్య ఏడు లక్షలకు చేరుకోవడం విశేషం.

‘బాహుబలి’ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా గురించి ‘అవంతిక’ మాట్లాడుతూ.. ‘ఇన్‌స్టాగ్రామ్‌లోకి రమ్మని చాలా రోజులుగా ప్రభాస్‌ను అడుగుతూనే ఉన్నాం. చివరికి ఇప్పుడు వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి ఆయన అభిమానులు చాలా ఆనందపడ్డారు’ అని చెప్పారు. ప్రభాస్‌ ఇంత వరకు తన ఖాతాలో ఒక్క పోస్ట్‌ కూడా చేయలేదు. ‘సాహో’ సినిమా అప్‌డేట్స్‌ను షేర్‌ చేయాలని ఆయన భావిస్తున్నారట. అందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. తమన్నా ఇటీవల ‘f2’ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘సైరా’, ‘అభినేత్రి 2’, ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.