హీరో కారు ఢీకొని మహిళ మృతి.. హీరోకు గాయాలు

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రోడ్డు ప్రయాణంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉన్నది. గుంటూరు జిల్లా చినకాకాని హైవైపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా మృతి చెందగా.. కారులో ప్రయాణిస్తున్న సినీ హీరో సుధాకర్ కు గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే…

హైదరాబాద్ నుంచి గుంటూరుకు హీరో సుధాకర్ ఇన్నోవా కారులో ప్రయాణం చేస్తున్నాడు. చినకాకాని వద్దకు రాగానే హైవై మొక్కలకు నీళ్లు పడుతున్న మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా… కారులో ప్రయాణిస్తున్న హీరో సుధాకర్ కు గాయాలయ్యాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సుధాకర్, నువ్వు తోపురా సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ప్రమోషన్లో భాగంగా గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.