ప్రభాస్ మైనపు బొమ్మ అదిరింది!

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని పెట్టడానికి ఆ సంస్థ నిర్వాహకులు ప్రత్యేకంగా హైదరాబాద్ కు వచ్చి ప్రభాస్ కొలతలు తీసుకొని వెళ్ళిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా షూటింగ్ సమయంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ మైనపు విగ్రహానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. అయితే ఇంతలోనే ఈ మైనపు విగ్రహం ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఓ పక్క బాహుబలి2 సినిమా విజయం, మరో పక్క ప్రభాస్ మైనపు విగ్రహం ఫోటోలతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ మైనపు విగ్రహానికి సంబంధించిన అఫీషియల్ ఫోటోలను ఇంకా విడుదల చేయలేదు. ఈ బొమ్మను చూడాలంటే గనుక బ్యాంకాక్ వెళ్ళాల్సిందే. నిజానికి టుస్సాడ్స్ మ్యూజియం మెయిన్ బ్రాంచ్ లండన్ లో ఉంది. కానీ ప్రత్యేకంగా సౌత్ ఆసియా ప్రముఖుల కోసం బ్యాంకాక్ లో ఈ బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో ఉన్న మైనపు బొమ్మలలో మొదటి దక్షిణాది నటుడు విగ్రహం ప్రభాస్ ది కావడం విశేషం.