లక్కీ ఛాన్స్ కొట్టేసిన ప్రణీత

అత్తారింటికి దారేది సినిమా తరువాత ప్రణీత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా కలిసిరాలేదు. అప్పుడప్పుడు టాలీవుడ్ ను పలకరిస్తోంది ఈ భామ. అటు కన్నడంలో సినిమాలు చేస్తూ బిజీగా మారిన ప్రణీత… ఎన్నికల సమయంలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. రాష్ట్రంలో ఎన్నికలపై అవగాహనా కల్పించేందుకు ఎన్నికల కమిషన్ ప్రణీతను రాష్ట్ర ఐకాన్ గా నియమించింది. దానికి సంబంధించిన పత్రాన్ని ఎన్నికల కమిషన్ ప్రణీతకు అందజేసింది. ఈ పత్రాన్ని ప్రణీత తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి… తనను ఎంపిక చేసినందుకు ఎన్నికల కమిషన్ కు కృతజ్ఞతలు తెలిపింది.