HomeTelugu Trendingకేరళలో మానవత్వానికే మచ్చ తెచ్చిన ఘటన

కేరళలో మానవత్వానికే మచ్చ తెచ్చిన ఘటన

8 2
మానవుడిని నమ్మి మోసపోయిన ఓ జంతువు దీన గాధ ఇది. కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ప్రపంచంలో మానవుల కంటే జంతువులకే నమ్మకం, విశ్వాసం ఎక్కువ. నమ్మిన వారిని మోసం చేయడంలో మానవుడిని మించి ఈ భూమిపైన మరే జీవి ఉండదేమో. ఆకలితో ఉన్న ఓ జంతువుకు ఆహారం ఆశ చూపి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు నరరూప రాక్షసులు. గర్భంతో ఉన్న ఓ ఏనుగు ఆహారం వెతుక్కుంటూ సైలెంట్ వ్యాలీ సమీపంలోని గ్రామంలోకి వచ్చింది. ఎవరినీ ఏమీ చేయకపోయినా కొందరు పనిలేని.. పనికిమాలిన వాళ్లు ఆ ఏనుగుకు ఓ ఫైనాపిల్‌ను ఆశచూపించి అందులో పేలుడు పదార్థాన్ని పెట్టి తినిపించారు. దానిని తినడానికి ప్రయత్నించగా నోటిలో పేలి ఏనుగు తీవ్రంగా గాయపడింది. రక్తమోడుతున్నా ఆ మూగజీవి ఎవరినీ ఏమీ చేయకుండా బాధగా ఆ గ్రామాన్ని వదిలి వెళ్లిపోయింది.

కడుపులో బిడ్డ, మరో వైపు గాయం బాధతో ఆ ఏనుగు ఓ నదిలో దిగిపోయింది. అటవీ అధికారులు ఆ ఏనుగును బయటకు తీసేందుకు ఎంతగా ప్రయత్నించినా గాయం బాధను తట్టుకోలేకపోతున్న ఆ ఏనుగు ఆ నీటిలోనే ఉండిపోయింది. కొద్ది రోజుల పాటు బాధతో కుమిలిపోయి చివరకు ఆ నదిలోనే ప్రాణాలు విడిచింది. హృదయాన్ని తల్లడిల్లేలా చేసిన ఈ ఘటనను మల్లప్పురం అటవీ అధికారి తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ఆ ఏనుగును పరీక్షించి గర్భంతో ఉందని తెలిసి వైద్యులు కూడా విచారం వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu