హృతిక్‌ పై కంగనా షాకింగ్‌ కామెంట్స్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్ రోషన్- కంగనా రనౌత్‌ మధ్య పదునైన మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. వీరి వివాదం సినీ పరిశ్రమ నుంచి వ్యక్తిగత విషయాల్లోకి కూడా వ్యాపించింది. బాలీవుడ్‌లో ‘మీటూ’ ప్రకంపనలు చెలరేగుతున్న నేపథ్యంలో ‘క్వీన్‌’ దర్శకుడు వికాస్‌ బెహల్‌ మీద కంగనా షాకింగ్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా హృతిక్‌ రోషన్‌పైనా వ్యాఖ్యలు చేశారు.

సామాజిక మాధ్యమాల వేదికగా హృతిక్‌పై కంగనా మాటల దాడికి దిగింది. ‘వికాస్‌ విషయంలో జరిగింది అక్షరాల నిజం. వికాస్‌ ఒక్కడే కాదు..అతడిలా ఎంతో మంది ప్రపంచంలో చెలామణి అవుతున్నారు. కానీ వాళ్ల గురించిన నిజాలు బయటకి రావడం లేదు వస్తే వాళ్లు కూడా ఇలాగే బయటకి వస్తారు. కొంతమంది భార్యలను ట్రోఫీల్లాగా ఇంట్లో పెట్టి అందంగా, యుక్త వయసులో ఉన్న అమ్మాయిలతో సంబంధం పెట్టుకుంటారు. వారికి మాయమాటలు చెప్పి అబద్ధపు ప్రమాణాలు చేస్తారు. ఇది కూడా ఒకరకంగా హింస కిందకే వస్తుంది. హృతిక్‌ లాంటి వాళ్లు అలాగే చేస్తారు.అలాంటి వాళ్లు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తర్వాత వాళ్లని పిచ్చివాళ్లను చేస్తారు. అలాంటి వాళ్లతో కలిసి పనిచేయాలని ఎవరూ అనుకోరు. అలాంటి వాళ్లని బాయ్‌కాట్‌ చేయాలి’ అంటూ కంగనా షాకింగ్‌ పోస్టులు పెట్టారు.