జంబలకిడి పంబగా మారిన బిగ్‌బాస్‌ హౌస్‌ సభ్యులు

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-2 చివరి ఘటనికి చేరుకుంది. ఈ హౌస్‌లో ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గత వారం పోల్చుకుంటే ఈ వారం ఇంటి సభ్యులు కాస్త ప్రశాంతంగా ఉన్నారు. చివరి వారం కావడంతో బిగ్ బాస్ హౌస్ లో సరదా వాతావరణం నెలకొని ఉంది. నేడు ప్రసారం చేయబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజా విడుదల చేశారు. తనీష్, సామ్రాట్, దీప్తి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. సరికొత్త అవతారంలో తనీష్, సామ్రాట్ కనిపిస్తున్నారు. తనీష్, సామ్రాట్ ఇద్దరూ అమ్మాయిలాగా ప్రవర్తిస్తున్నారు. టాస్క్ లో భాగంగా వీరిద్దరూ అలా మారి ఉండవచ్చు. అమ్మాయిలలాగే మాట్లాడుతూ దీప్తితో వాదులాడుతున్నారు. నేడు జరగబోయే ఎపిసోడ్ పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది.

తనీష్, సామ్రాట్, దీప్తి మధ్య గులాబ్ జాముల గురించి రచ్చ జరుగుతుందంటే హౌస్ లో ఎంత సరదా వాతావరణం నెలకొనివుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత సరదా సంభాషణలో కూడా తనీష్, సామ్రాట్ కలసి కౌశల్ పై సెటైర్లు వేస్తున్నారు. చివరి వారంలో కూడా ఇంటి సభ్యులంతా కౌశల్ ను టార్గెట్ చేసినట్లు నిన్నటి ఎపిసోడ్ ద్వారా స్పష్టంగా అర్థం అవుతోంది. అందరూ కౌశల్ కు డిస్ లైక్ సింబల్ ని కౌశల్ ఫోటో పక్కన ఉంచారు. 100 రోజులకు పైగా అలరిస్తున్న బిగ్ బాస్ 2 షో ఈ ఆదివారంతో ముగియబోతోంది. విజేత ఎవరనే విషయాన్ని ఆదివారం నాని ప్రకటించబోతున్నారు. ఐదుగురు ఇంటి సభ్యులలో ఎవరు బిగ్ బాస్ టైటిల్ ని ఎవరు సొంతం చేసుకుంటారో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొని ఉంది. కౌశల్, తనీష్, గీత మధ్య తీవ్రమైన పోటీఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఆదివారం ఎపిసోడ్‌ సాయంత్రం 6గం. నుండి ప్రసారం కానుంది.