HomeTelugu Big Storiesతెలుగులో వరుస ఆఫర్‌లతో దూకుడు మీదున్న ప్రియా వారియర్‌..

తెలుగులో వరుస ఆఫర్‌లతో దూకుడు మీదున్న ప్రియా వారియర్‌..

10aనటించన తొలి సినిమా ఇంకా విడుదల కాలేదు. అపుడే ప్రియా ప్రకాష్ వారియర్‌కి అవకాశలు మాములుగా లేదు. ఈ భామ ఫస్ట్ సినిమా ‘ఒరు అదారు లవ్’. ఈ సినిమా విడుదల కానే లేదు. అపుడే బాలీవుడ్‌లో ‘శ్రీదేవి బంగ్లా’ సినిమా చేసే చాన్స్ కొట్టేసింది. అంతేకాదు ఈ సినిమా టీజర్ విడుదల కావడమే ఆలస్యం ఈ సినిమాపై పెద్ద వివాదమే నడుస్తోంది.

ఇక ‘ఒరు అదారు లవ్’ సినిమా తెలుగులో ఫిబ్రవరి 14న ‘లవర్స్ డే’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కాకముందే తెలుగులో ప్రియా వారియర్ రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పిందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అందులో ముందుగా త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో ప్రియా వారియర్‌ను ఒక హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. తాజాగా అల్లు అర్జున్ ‘లవర్స్ డే’ ఆడియో ఫంక్షన్‌కు వెళ్లింది అందుకే అని చెబుతున్నారు. పైగా తెలుగు హీరోల్లో అల్లు అర్జున్‌కు కేరళలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రకంగా ప్రియా వారియర్‌ను హీరోయిన్‌గా తీసుకోవడంతో కేరళలో ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా రష్మిక మందనను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

10

ఇంకోవైపు ప్రియా వారియర్.. నాని, విక్రమ్ కుమార్ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించడానికి ఓకె చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాలో మొత్తంగా ఐదుగురు హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారు. అందులో ఒక హీరోయిన్‌గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి అల్లు అర్జున్, నాని వంటి క్రేజీ హీరోల సినిమాలతో తెలుగులో కూడా ప్రియా వారియర్‌ తన దూకుడు చూపించే అవకాశమైతే ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!