HomeTelugu Trendingకీర్తి సురేశ్‌ ప్లేస్‌లో ప్రియమణి..

కీర్తి సురేశ్‌ ప్లేస్‌లో ప్రియమణి..

3 16
బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ సరసన నటించే అవకాశం ప్రియమణి దక్కించుకున్నారు. ఆ చిత్రం నుంచి కీర్తి సురేశ్‌ తప్పుకోవడంతో ప్రియమణి ఆ పాత్రను దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వంలో అజయ్‌ దేవగన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘మైదాన్’‌. భారత ఫుట్‌బాల్‌ మాజీ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో కీర్తి సురేశ్‌ను ఎంపిక చేశారు. జీ స్టూడియోస్‌, బోని కపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి కీర్తి తప్పుకున్నారు. కీర్తి ఈ చిత్రంలో పెద్ద వయస్కురాలి పాత్రలో నటించాల్సి ఉండగా.. అందుకు ఆమె సరిపోదని చిత్ర నిర్మాతలు భావించారు. ఈ చిత్రం అంగీకరించినప్పుడు కీర్తి కొద్దిగా బొద్దిగా ఉన్నారని.. ప్రస్తుతం ఆమె సన్నబడ్డారని నిర్మాతలు తెలిపారు. కీర్తి కూడా తను ఆ పాత్రకు సరిపోననే భావనలో ఉండటంతో ఆమె ఈ చిత్రం నుంచి తప్పకున్నట్టు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ చిత్రంలో కీర్తి పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం నిర్మాతలు ప్రియమణిని సంప్రదించగా.. ఆమె కూడా ఆసక్తి కనబరిచినట్టుగా సమాచారం. కాగా, ప్రసుత్తం ప్రియమణి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో శశికళ పాత్రలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!