HomeTelugu Big Storiesరెండో పెళ్లి చేసుకోబోతున్న దిల్‌ రాజు?

రెండో పెళ్లి చేసుకోబోతున్న దిల్‌ రాజు?

14 5
ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నాడనే వార్తలు రెండు మూడు రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు ఇంత ఉన్నయో తెలియదు. టాలీవుడ్‌లో దిల్ రాజుకు తిరుగులేని ఇమేజ్ ఉంది. ఆయన బ్యానర్‌లో సినిమా వచ్చిందంటే చాలు.. హిట్‌ గ్యారెంటీ అనే నమ్మకం ఉంది. తాజాగా ‘జాను’ సినిమాతో మాయ చేస్తున్నాడు ఈయన. ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తున్నాడు.

అయితే ఈయన త్వరలోనే రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు భార్య అనిత మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో కొన్నాళ్లు ఆ షాక్ నుంచి బయటికి రాలేకపోయాడు. తన వెంకటేశ్వర బ్యానర్ సినిమాల్లో తన సినిమాలకు భార్య పేరునే ముందుగా వేస్తుంటాడు దిల్ రాజు. ఈ దంపతులకు ఒకే కూతురు కాగా ఆమెకు పెళ్లి అయిపోయింది. భార్య చనిపోయిన తర్వాత రాజు ఒంటరి అయిపోయాడు. దాంతో ఈయనకు తోడు కావాలని.. దాంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని సన్నిహితులు కూడా సలహాలు ఇవ్వడంతో రాజు కూడా ఆ వైపుగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ దిల్ రాజు మాత్రం ఈ విషయంపై క్లారీటి ఇవ్వలేదు.

కుటుంబ సభ్యులను ఆరా తీసే ప్రయత్నం చేసినా కూడా వాళ్లు కూడా రెండో పెళ్లి గురించి రెండో వివాహం పై స్పందించడం లేదు. దిల్ రాజు కూతురు నిర్ణయంపైనే ఈయన రెండో పెళ్లి ఆధారపడి ఉందని ప్రచారం జరుగుతుంది. తాత అయినా కూడా దిల్ రాజు మాత్రం అలా అయితే కనిపించడు. దాంతో ఈ వయసులో ఒంటరిగా మిగిలిపోకుండా పెళ్లి చేసుకుంటే తప్పేంటి అంటున్నారు కొందరు. అలా సన్నిహితుల బలవంతంపైనే ఈ పెళ్లికి దిల్ రాజు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఈయన మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా అలాంటి ప్రస్థావన మాత్రం తీసుకురాలేదు. ఈ రెండో పెళ్లిపై అతి త్వరలోనే కీలక సమాచారం బయటికి రానుందని ఇండస్ట్రీ వర్గాలు కూడా చెబుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!