HomeTelugu Trendingతర్వాత తరం వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం మానేయాలి: పూరీ జగన్నాద్‌

తర్వాత తరం వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం మానేయాలి: పూరీ జగన్నాద్‌

3
కరోనా వైరస్‌ నివారణ చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతుంది. సినిమా షూటింగ్స్‌, థియేటర్స్ మూతపడ్డాయి. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న సినిమాల రీలిజ్‌లు ఆగిపోయాయి.

కరోనాపై అవగాహణపై కల్పించేందుకు సినీ ప్రముఖులు పలు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వండి అంటూ ఎన్నో సందేశాలు ఇస్తున్నారు. ఇంట్లోంచి బయట అడుగు పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిం చండి అంటూ సినీ ప్రముఖులు వివిధ రూపాల్లో చెబుతున్నారు. తాజాగా డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాద్ కూడా ఓ సందేశాన్ని ఇచ్చారు. ప్రకృతిని మానవుడు ఎప్పటికీ అర్ధం చేసుకోడు. అందుకే అదే అందరిని సర్ధేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంది. భూమి పై జరిగే ప్రతి విపత్తుకు మానవుడే కారణం. అసలు ప్రకృతి ముందు మనమెంత? దాని దృష్టిలో మానవజాతి ఈ భూమికి పట్టిన ఓ వైరస్. అన్ని దేశాలు జనాభాను నియంత్రించాలి అని చెబుతూనే… తర్వాత తరం వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం మానేయాలి అని అంటున్నాడు. పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు చేసి పిల్లల్ని కనుకుంటూ వెళ్లిపోతే అన్ని జంతువులు అంతరించి పోయి భూమ్మీద మనుషులే మిగులుతారు. తర్వాత వాళ్లే జంతువులుగా మారతారేమో అనిపిస్తోంది… అంటూ తన స్టైల్ లో చెప్పుకొచ్చాడు పూరి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu