HomeTelugu Big Storiesరివ్యూ: రా రండోయ్ వేడుక చూద్దాం

రివ్యూ: రా రండోయ్ వేడుక చూద్దాం

నటీనటులు: నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సంపత్ తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్
ఎడిటింగ్: గౌతమ్ రాజు
నిర్మాత: అక్కినేని నాగార్జున
దర్శకత్వం: కల్యాణ్ కృష్ణ
నటుడిగా తన రీచ్ ను మరింత పెంచుకోవడానికి నాగచైతన్య ఎన్నుకున్న సినిమా ‘రా రండోయ్
వేడుక చూద్దాం’. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో సక్సెస్ అందుకున్న కల్యాణ్ కృష్ణ మరోసారి
ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఆడియన్స్ కు ఎంతవరకు రీచ్
అయిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
భ్రమరాంబ(రకుల్ ప్రీత్ సింగ్)ను చిన్నప్పటినుండి ఎంతో గారంబంగా పెంచుతారు. కుటుంబం తప్ప మరో విషయం తెలియని భ్రమరాంబను ఓ పెళ్ళిలో చూసి ప్రేమిస్తాడు శివ(నాగచైతన్య).చదువుకోవడం కోసం భ్రమరాంబ వైజాగ్ వెళ్తుంది. శివ కూడా అక్కడే ఉండడంతో అతడితో పరిచయం పెరుగుతుంది. అయితే శివ కుటుంబానికి భ్రమరాంబ కుటుంబానికి మధ్య పాత గొడవలు ఉంటాయి. ఈ విషయం తెలియక శివ, భ్రమరాంబను ప్రాణంగా ప్రేమిస్తాడు. ఒకానొక సమయంలో భ్రమరాంబ కూడా శివను ఇష్టపడుతుంది. మరి వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయా..? అసలు వారి మధ్య ఉన్న గొడవలు ఏంటి..? శివ, భ్రమరాంబల ప్రేమ సక్సెస్ అయిందా..?అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:
దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఎన్నుకున్న్దది రొటీన్ కాన్సెప్ట్ అయినా.. తన ట్రీట్మెంట్ తో కథను కొత్తగా చెప్పాలనుకున్నాడు. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే వరకు కథలో ఎంటర్ కాకపోవడం అసహనానికి గురి చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కూడా అనవసరపు కామెడీ సన్నివేశాలు ఉన్నాయి. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ మొదలయిన తరువాత కథపై ఆసక్తి కలుగుతుంది. అయితే సినిమా మొత్తం ఆ ఆసక్తిని కంటిన్యూ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ప్రేమపై విరక్తి కలిగి హీరో చెప్పే డైలాగ్స్ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్ళాయి. సినిమాకు డైలాగ్స్ ప్లస్ అయ్యాయి.

శివ పాత్రలో చైతు ఒదిగిపోయాడు. ఇప్పటివరకు చైతుని ఇటువంటి ఎంటర్టైన్మెంట్ రోల్ లో చూడలేదు. తను
తప్ప మరెవరూ ఈ పాత్రకు సరిపోరు అన్నట్లుగా నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్.. భ్రమరాంబ పాత్రలో ఒదిగిపోయింది. సంప్రదాయ కట్టు, బొట్టులో అందంగా కనిపించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించింది. ఈ సినిమా తన కెరీర్ కు మంచి ప్లస్ అవుతుంది. జగపతి బాబు పాత్ర రొటీన్ రిచ్ ఫాదర్. ఎప్పటిలానే ఆయన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సంపత్ హీరోయిన్ తండ్రి పాత్రలో చక్కని నటన కనబరిచాడు.

టెక్నికల్ గా సినిమా క్వాలిటీ బావుంది. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంది. దేవిశ్రీ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచింది.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. పాటలు కూడా సంధార్భానుసారంగా కథలో భాగంగా ఉన్నాయి. కొరియోగ్రఫీ బావుంది. సినిమాలో కాస్త ల్యాగ్ ఎక్కువైంది. నిర్మాణ విలువలు బావున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu