HomeTelugu Trendingజోరుమీదున్న రాశీ ఖన్నా

జోరుమీదున్న రాశీ ఖన్నా

4 18
టాలీవుడ్‌లో ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా. ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన హీరోయిన్‌గా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘తొలిప్రేమ’లో నటించి సూపర్ హిట్ అందుకుంది. రాశీ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. అది అలా ఉంటే రాశీ, సాయి తేజ్ హీరోగా వస్తోన్న ‘ప్రతిరోజూ పండగే’లో నటిస్తోంది. ఈ సినిమా ఈరోజు డిసెంబర్ 20న విడుదలైంది. కేవలం నటిగానే కాకుండా రాశీకి ఇంకో టాలెంట్‌ కూడా ఉంది. అదే సింగింగ్‌. తొలిసారి ‘జోరు’ సినిమా కోసం గొంతు సవరించుకున్న రాశీ వీలున్నప్పుడల్లా పాటలు పాడుతూ అదరగొడుతోంది. తాజాగా ప్రతిరోజూ పండగేలో కూడా పాడింది. అంతకు ముందు జవాన్‌లో కూడా అదరగొట్టింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!