
కరోనా వైరస్ ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో ఆకలి కేకలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు నడుం బిగించారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్, నటుడు రాఘవ లారెన్స్ తన గొప్ప మనస్సుని చాటుకున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తన వంతు సాయంగా మూడు కోట్ల రూపాయాలను విరాళం అందించారు లారెన్స్.
పీఎం-కేర్స్ ఫండ్‌కు 50 లక్షలు, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షలు, ఫెఫ్సి యూనియన్‌కు 50 లక్షలు, డ్యాన్సర్స్ యూనియన్‌కు 50 లక్షలు, తన దగ్గర ఉన్న దివ్యాంగులకు 25 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తన సొంత ఊరు రోయపురానికి చెందిన దినసరి కూలీలు, ప్రజల కోసం 75 లక్షలు వెచ్చించనున్నట్లు లారెన్స్ తెలిపారు.













