తమన్నా పాటకు డ్యాన్స్ అదరగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే.. వైరల్‌


ఆంధ్రప్రదేశ్‌ కి చెందిన కొంత మంది వైసీపీ నాయకులు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా.. తమలోని కళాపోషణకు పదును పెడుతున్నారు. కూతంత కళా పోషణ లేకపోతే మనిషికి గొడ్డుకి పేద్ద తేడా లేదనుకుంటున్నారో ఏమో.. మొన్నామధ్య ఉప ముఖ్యమంత్రి పుష్ఫశ్రీవాణి చేసిన టిక్‌టాక్ వీడియోలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఒక పాఠశాలకు చెందిన వార్షికోత్సవంలో తమన్నా పాటకు చిందేసాడు. తమన్నా హీరోయిన్‌గా నటించిన హిమ్మత్‌వాలా సినిమాలోని ‘నైనో మే సప్నా’ పాటకు ఓ రేంజ్‌లో డాన్స్ ఇరగదీసాడు ఈ ఎమ్మెల్యే. డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.