లారెన్స్ రియల్ హీరో అనిపించుకున్నాడు!

సాధారణ కొరియోగ్రాఫర్ స్థాయి నుండి ఇప్పుడు డైరెక్టర్ గా హీరోగా మారి తన ప్రతిభను చాటుకున్నాడు లారెన్స్. సామాజిక కార్యక్రమాల్లోనూ… ఎదుటివారికి సహాయం అందించే విషయంలో లారెన్స్ ఎప్పుడు ముందుంటాడు. అయితే రీసెంట్ గా ఆయన తన నిర్మాతకే సహాయం చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో వచ్చిన ‘పటాస్’ సినిమాను లారెన్స్ హీరోగా ‘మొట్ట శివ కెట్ట శివ’ అనే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు.
ఈ సినిమా నిర్మాణం పూర్తయినా.. ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దానికి కారణం నిర్మాత ఆర్థిక కష్టాలే.. ఈ విషయం తెలుసుకున్న లారెన్స్ నిర్మాతను పిలిచి గతంలో తన సినిమా కోసం ఎంతైతే రెమ్యూనరేషన్ తీసుకున్నాడో.. అంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడట. ఆ డబ్బుతో సినిమా రిలీజ్ చేయమని లారెన్స్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాత సినిమాను ఈ నెల 17న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తమకు ఇవ్వాల్సిన పారితోషికంలో ఏ మాత్రం తగ్గినా నిర్మాతను ఇబ్బంది పెట్టే హీరోలున్న ఈరోజుల్లో అడగకుండానే తన నిర్మాతను ఆదుకున్న లారెన్స్ ఉదార స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది.