పునర్నవికి పెళ్లి చేసుకోవాలంటూ రాహుల్ సలహా


బిగ్‌బాస్-3 తెలుగు విజయవంతంగా నడుస్తోన్న రియాల్టీ షో. ఇప్పటి వరకు ఆరు వారాలు పూర్తయి ఏడో వారం షో కొనసాగుతోంది. గత ఎపిసోడ్స్‌లో బిగ్‌బాస్ టాస్క్‌లో భాగంగా రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌ ఎవరు అంటే రాహుల్‌, రవి పేర్లను అందరూ కలిసి ఏకాభిప్రాయంతో బిగ్‌బాస్‌కు సూచించారు. దీంతో వారిద్దరినీ జైల్లో బంధించాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. జైల్లో ఉన్న రాహుల్‌ వద్దకు పునర్నవి వచ్చి ముచ్చట్లు పెట్టింది. దీనిలో భాగంగా రాహుల్‌తో తన వ్యక్తిగత విషయాలు చెప్పింది. తనకు ఇంకా చదువుకోవాలని ఉందని, ఇది కాకపోతే తాను ఎలాగైనా బతకగలనని.. ఎందుకంటే తనకు డిగ్రీ ఉందని ఏదైనా ఉద్యోగం చేసుకుని బతకగలనని రాహుల్‌తో చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. తనకు ఆప్షన్స్‌ అంటే చాలా ఇష్టమని, అలా ఉంటే తనెప్పుడూ ఎవరికీ తలొంచకుండా ఉండగలనని చెప్పుకొచ్చింది. అలాగేఉంటుంది ఇక్కడ.. నేను ఓ తెలుగు అమ్మాయిని అంటూ క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించే పునర్నవి మాట్లాడినట్లు అనిపిస్తోంది.

ఈ సందర్భంగా పునర్నవికి రాహుల్ ఓ సలహా ఇచ్చాడు. బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో ఉన్నారని అన్నావ్‌గా.. ఇండస్ట్రీని వదిలేసి.. పెళ్లి చేసుకో.. సెటిల్‌ అయిపో..అంటూ సలహా ఇచ్చాడు. తనకు ఇంకో రెండేళ్లు చదువుకోవాలని ఉందంటూ రాహుల్‌తో చెప్పుకొచ్చింది. ఇలా రాత్రంతా మాట్లాడుకుంటూ ఉన్న ఈ జంటకు ఉదయాన్నే ఓ గొడవ జరిగింది. పడుకుని ఉన్న రాహుల్‌ని లేపేందుకు ప్రయత్నించింది పునర్నవి. పిచ్చిది అలానే చేస్తది అని పునర్నవి గురించి రాహుల్‌.. రవితో అనేసరికి ఆమె ఫీల్‌ అయింది. అక్కడి నుంచి వెళ్లి కన్నీరు పెట్టుకుంది.