HomeTelugu Big Stories'ఆర్‌ఆర్‌ఆర్‌' అప్డేట్‌.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అప్డేట్‌.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

Rajamouli resumes shooting
టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ధర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్‌ను మూవీ యూనిట్ రిలీజ్‌ చేసింది‌. మేకింగ్ వీడియోను విడుదల చేసింది. అక్టోబరు 22న “రామరాజు ఫర్ భీమ్” కోసం ఎదురుచూడమని చిత్ర బృందం వెల్లడించింది. తద్వారా అభిమానుల ఎదురు చూపులకు తెరదించినా మరో ఉత్కంఠకు తెరతీసింది. అక్టోబరు 22 రామ్ చరణ్ వాయిస్ తో ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ కానుంది.

పీరియాడిక్‌ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు సహా అన్ని భాషల్లో విడుదల కానుంది. దాదాపుగా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏడు నెలల విరామం తరువాత హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఈ సందర్బంగా యూనిట్ బృందాన్ని క్వారంటెన్‌లో ఉంచినట్టు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయ్యే వరకు బయటి వ్యక్తులను కలిసేందుకు అనుమతి లేకుండా పకడ్బందీ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ సెట్లో ఒక వైద్య బృందం అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!