HomeTelugu Trendingత్వరలో రజనీ 168వ సినిమా

త్వరలో రజనీ 168వ సినిమా

8 11
సంక్రాంతికి ‘పేట’ సినిమాతో పలకరించిన రజనీకాంత్‌ త్వరలో ‘దర్బార్‌’ సినిమాతో థియేటర్ల్‌లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సెట్‌ మీద ఉండగానే మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు తలైవా. ‘రోబో’, ‘పేట’ సినిమాల తర్వాత సన్‌ పిక్చర్స్‌ కాంబినేషన్‌లో రజనీ ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ”రజనీకాంత్‌ నటించబోతున్న 168వ సినిమా ఇది. శివ దర్శకత్వం వహిస్తారు” అంటూ రజనీ, శివ, కళానిధి మారన్‌ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసి తెలిపింది సన్‌ పిక్చర్స్‌ సంస్థ. తెలుగులో ‘శంఖం’, ‘శౌర్యం’, ‘దరువు’ సినిమాలకు దర్శకత్వం వహించిన శివ అజిత్‌తో ‘వేదాలం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి భారీ విజయాలు అందించి ఫుల్‌ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu