HomeTelugu Newsశ్రీహరి కొడుకు 'రాజ్‌ధూత్' మూవీ ట్రైలర్‌

శ్రీహరి కొడుకు ‘రాజ్‌ధూత్’ మూవీ ట్రైలర్‌

12దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్‌ హీరోగా నటించిన ‘రాజ్‌ధూత్’ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. అర్జున్‌ గున్నాల, కార్తీక్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సినిమాలో విలన్‌ రాజ్‌ధూత్‌ బైక్‌ కోసం వెతుకుతుంటాడు. ఆ బైక్‌ను తీసుకురావాలని మేఘాంశ్‌ చెప్తాడు. అలా మేఘాంశ్‌ బైక్‌ కోసం తన స్నేహితుడితో కలిసి అన్వేషిస్తుంటాడు. ‘అంకుల్‌.. పట్టుదల ఉన్నోడికి పనిస్తే బట్టతలపై కూడా జుట్టు రప్పిస్తాడు’ అని మేఘాంశ్ చెప్పే డైలాగ్‌ ఫన్నీగా ఉంది. ఇందులో నక్షత్ర హీరోయిన్‌గా నటించారు. మొత్తానికి సినిమాలో బైక్‌దే ప్రధాన పాత్ర అని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!