ఎకానమీ క్లాస్‌లో స్టార్‌ హీరో.. నెటిజన్లు ప్రశంసలు

సాధారణంగా సెలబ్రిటీలు బిజినెస్‌ క్లాస్‌లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతుంటారు. వారు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే సందర్భాలు అరుదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో.. ఇండిగోకు చెందిన విమానంలో ప్రయాణికులకు ఓ సర్‌ప్రైజ్‌ ఎదురైంది. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ ఖాన్‌ ఎకానమీ క్లాస్‌లో దర్శనమిచ్చారు. ఓ సాధారణ ప్రయాణికుడిలా విండో సీటులో నవ్వుతూ కూర్చున్నారు. ఆ సందర్భంలో ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ విరాల్‌ భయానీ వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆమిర్‌ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ‘అమీర్‌ భాయ్‌.. నువ్వు రియల్‌ హీరో’ అంటూ ఆయన్ను ప్రశంసించారు. త్వరలో ఆమిర్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ అనే చిత్రంలో నటించబోతున్నారు.

View this post on Instagram

#ripbusinessclass 😛 #aamirkhan

A post shared by Viral Bhayani (@viralbhayani) on