పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో రజినీ దర్బార్‌

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న దర్బార్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు మోషన్ పోస్టర్ తప్పించి మరొకటి రిలీజ్ కాలేదు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ గుడ్ న్యూస్ ను చిత్ర బృందం ప్రకటించింది.

దర్బార్ సినిమాలోని ఓ సాంగ్‌ను రేపు విడుదల చేయబోతున్నారు. ఫస్ట్ సింగిల్ చుమ్మా కీజీ… అనే సాంగ్ ను చిత్రబృందం రిలీజ్ చేయబోతున్నది. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న దర్బార్ పాటల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ సింగిల్ తమిళంలో మాత్రమే రిలీజ్ చేస్తారా లేదంటే మిగతా భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్
చేస్తారా అన్నది తెలియాలి. సినిమా మొత్తం పూర్తిగా ముంబై బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుంది కాబట్టి షూటింగ్ ఎక్కువ భాగం ముంబైలోనే జరిగింది. 25 ఏళ్ల తర్వాత రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమాలో రజినీ సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తున్నది. డిసెంబర్ 5వ తేదీన రజిని 168వ సినిమా వ్యూహం ప్రారంభం కాబోతున్నది.