రజినీ టైటిల్ నయన్ కోసం!

రోజురోజుకి తన క్రేజ్ ను అందాన్ని మరింత పెంచుకుంటూ వరుస అవకాశాలతో, హిట్స్ తో దూసుకుపోతుంది నయనతార. ప్రస్తుతం ఆమె పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా తను నటించిన ‘డోరా’ సినిమా టీజర్ రిలీజ్ అయి అశేష స్పందనను దక్కించుకుంటుంది. అయితే నయన్, తని ఒరువన్ వంటి మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న మోహన్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది.

ఈ సినిమాకు ‘వేలైక్కారన్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. గతంలో రజినీకాంత్ హీరోగా బాలచందర్ దర్శకత్వంలో ఇదే టైటిల్ తో సినిమా వచ్చింది. అప్పట్లో ఆ సినిమా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు అదే టైటిల్ రూపొందుతోన్న ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఆగస్ట్ నెలలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.