సర్కార్ వేడుకకు ముఖ్య అతిథిగా రజనీ..!

కోలీవుడ్ సూపర్‌ స్టార్ విజయ్‌.. టాలెంటెడ్‌ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కార్’‌. ప్రస్తుతం ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. దీపావళి కానుకగా విడుదలకు సిద్దం అవుతున్న ఈ సినిమా ఆడియో వేడుక ను అక్టోబర్‌ 2న అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారట.

ఇద్దరు సూపర్‌ స్టార్లు ఒకే వేదికపైకి రానుండటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనాల వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ చెపాక్‌ స్టేడియంకు పర్మిషన్ రాని పక్షంలో నెహ్రూ ఇండోర్‌ స్టేడియం లేదా వైఎమ్‌సీఏ స్టేడియాలలో ఒకదానిని ఫైనల్‌ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.