ఫైనల్ గా దిల్ రాజుతో రాజ్ తరుణ్!

వరుస సినిమాలు చేసుకుంటూ సక్సెస్ లను అందుకుంటున్న హీరో రాజ్ తరుణ్ తాజాగా దిల్ రాజుతో సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. నిజానికి దిల్ రాజు నిర్మించిన ‘శతమానం భవతి’ సినిమాలో హీరోగా రాజ్ తరుణ్ నటించాల్సివుంది. కానీ ఆ ప్రాజెక్ట్ నుండి ఈ యంగ్ హీరో తప్పుకున్నాడు. ఆ సమయంలో దిల్ రాజుకి, రాజ్ తరుణ్ కి మధ్య గ్యాప్ వచ్చిందని రకరకాల రూమర్స్ వినిపించాయి.

ఇప్పుడు ఆ ప్రచారానికి తెర దించుతూ రాజు గారి బ్యానర్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ హీరో. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. గతంలో అనీష్ ‘అలా ఎలా’ అనే సినిమాను రూపొందించారు. రాజ్ తరుణ్ నటిస్తోన్న ‘అంధగాడు’ సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు.