
Game Changer Cast Remunerations:
రామ్ చరణ్ తన సినిమాలతోనే కాదు, తన భారీ రెమ్యూనరేషన్‌తో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ కోసం రామ్ చరణ్ రూ. 100 కోట్ల పారితోషికం పొందుతున్నారు. ఇది సినిమా మొత్తం బడ్జెట్ అయిన రూ. 450 కోట్లలో 22% ఉంటుందని తెలుస్తోంది.
టాప్ హీరోల జాబితాలో రామ్ చరణ్
ఈ భారీ రెమ్యూనరేషన్‌తో రామ్ చరణ్, రజనీకాంత్, అల్లు అర్జున్, తలపతి విజయ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో చేరిపోయారు. ‘ఆర్ఆర్ఆర్’ వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలు రామ్ చరణ్‌ను ఇండస్ట్రీలో ప్యాన్ ఇండియన్ స్టార్‌గా నిలబెట్టాయి.
View this post on Instagram
గేమ్ చేంజర్: భారీ బడ్జెట్ ప్రాజెక్ట్
రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ భారతీయ చలన చిత్రాల్లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆమె రెమ్యూనరేషన్ కూడా రూ. 5-7 కోట్ల వరకు ఉందని సమాచారం.
రామ్ చరణ్ రెమ్యూనరేషన్ భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. ఆయన తదుపరి చిత్రం ‘RC 16’ (బుచ్చి బాబు సనా దర్శకత్వం) కోసం రూ. 125-130 కోట్ల పారితోషికం తీసుకోనున్నారు. ‘RC 16’ ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమాగా తెరకెక్కుతోంది. ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం ఈ ప్రాజెక్ట్‌కు మరింత ఆకర్షణ కల్పిస్తోంది.
జనవరి 10, 2025న విడుదల కానున్న ‘గేమ్ చేంజర్’ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ALSO READ: 2024 లో Hyderabad లో బాగా అమ్ముడయిన డెసర్ట్ ఏంటో తెలుసా?