HomeTelugu Big Storiesఇది కామ్రేడ్ మూమెంట్: రామ్‌ చరణ్‌

ఇది కామ్రేడ్ మూమెంట్: రామ్‌ చరణ్‌

Ram charan in Acharya sho

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఈ సినిమా తూర్పుగోదావరి జిల్లాలో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్ సిద్ధ అనే కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చరణ్ ఇటీవలే ట్విట్టర్ వేదికగా ఆచార్య సెట్స్ లోని తన పిక్ పోస్ట్ చేశాడు. మెగాస్టార్ తో కలిసి ప్రస్తుతం రామ్‌ చరణ్.. గోదావరి జిల్లాలలో పదిహేను రోజుల షెడ్యూల్లో పాల్గొన్నాడు.

రామ్‌ చరణ్ ఓ కొత్త ఫొటోతో ట్వీట్ చేస్తూ.. ‘ఇది కామ్రేడ్ మూమెంట్. ఆచార్య షూటింగ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. “నా తండ్రి మెగాస్టార్ డైరెక్టర్ కొరటాలతో టైం స్పెండ్ చేయడం ఆనందంగా ఉంది” అంటూ రామ్‌ చరణ్ భుజం పై మెగాస్టార్ చేతి వేసిన పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అలాగే ట్వీట్ పై కొరటాల శివ స్పందిస్తూ.. ‘సిద్ధ సిద్ధమవుతున్నాడు’ అని రిప్లై ఇచ్చాడు. కాగా మార్చ్‌ 27న చరణ్‌ పుట్టిన రోజుకి ఈ సినిమా నుండి సర్ప్రైజ్‌ వస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు.
మే 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!