కెమెరా ఆఫ్‌ చేస్తే మేము అన్నదమ్ములం

బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్ కెమెరా ఆఫ్‌ చేస్తే అన్నదమ్ములుగా కబుర్లు చెప్పుకున్నాం’ అని అంటున్నారు ‌. ‘కెమెరా ఆన్‌ చేస్తే రామ్‌చరణ్, నేను వారియర్స్‌లా ఫైట్‌ చేసుకున్నాం. రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ హైదారాబాద్‌లో జరుగుతోందని సమాచారం.

‘ఈ సినిమాకు సంబంధించి నా లాస్ట్‌ డే (శనివారం) షూటింగ్‌లో పాల్గొన్నాను. నా తమ్ముడు రామ్‌ చరణ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నువ్వు(రామ్‌ చరణ్‌) చూపించిన ప్రేమాభిమానలకు థ్యాంక్స్‌. గొప్ప నటులు చిరంజీవిగారిలో ఉన్న క్వాలిటీస్‌ అన్నీ ఆయన కొడుకు రామ్‌చరణ్‌లోనూ ఉన్నాయి’ అని పేర్కొన్నారు వివేక్‌. స్నేహ,ఆర్యన్‌ రాజేశ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నారు.