సూపర్‌స్టార్‌ ‘దర్బార్‌’ సినిమాలో లేడీ సూపర్‌ స్టార్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘దర్బార్‌’ చిత్రం సెట్‌లోకి నయనతార అడుగుపెట్టారు. తలైవా హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకి ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. రజనీ ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారు. ముంబయి నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఇటీవల ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
కాగా ఈ సినిమాలో రజనీ సరసన నయనతార నటించబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే మంగళవారం చిత్ర బృందం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఆమె ఇవాళ్టి నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నారని తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందని పేర్కొంది. రజనీ, నయన్‌ ఇప్పటికే ‘చంద్రముఖి’, ‘కథానాయకుడు’ సినిమాల కోసం కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఇది వారి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం.