పూరీతో గొడవలపై స్పందించిన వర్మ

ప్రముఖ దర్శకుడలు రామ్‌గోపాల్‌ వర్మ, పూరీ జగన్నాథ్‌ చాలా మంచి స్నేహితులు. వర్మ ముంబయి నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రతిసారి పూరీని కలుస్తుంటారు. అయితే వీరిద్దరి మధ్య స్నేహం చెడిందని ఓ ఆంగ్లపత్రిక రాసింది. సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డికి వర్మ మద్దతు ఇవ్వడం పూరీకి నచ్చలేదని, అందుకే వీరి మధ్య మాటలు లేవని రాశారు.

‘భైవరగీత’ సినిమా ప్రచారం కోసం ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన వర్మ.. పూరీని కలవలేదని, ఆయన ఇంటికి వెళ్లకుండా వేరే స్నేహితుడి దగ్గర బస చేశారని వార్తలు వచ్చాయి.దీన్ని చూసిన వర్మ ట్విటర్‌లో స్పందించారు. వార్తా పత్రిక కథనాన్ని షేర్‌ చేస్తూ.. ‘ఇది అబద్ధం.. నేను, పూరీ ఎప్పుడూలేనంత గాఢ స్నేహంలో ఉన్నాం’ అని ట్వీట్‌ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates