కత్తి పట్టుకుని ..అడ్డొస్తే కబడ్ధార్ అంటూ వార్నింగ్ ఇచ్చిన వర్మ.!

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల వర్మలో ఈమధ్య కామెడీ డోస్ కొంచెం ఎక్కువైంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మొదలుపెట్టినప్పటి నుండి ట్విట్టర్‌లో కవ్వింపు ట్వీట్లు చేస్తూ బోలెడు పబ్లిసిటీ తెచ్చుకుంటున్నాడు. సినిమాలోని ఒక్కొక్క పాత్రను విడుదల చేస్తూ ఆసక్తి రేపుతున్నాడు. ఇక ఈరోజైతే ఏకంగా ఒక ఫోటోను మార్ఫింగ్ చేసి అందులో కత్తి పట్టుకుని దర్శనమిచ్చాడు. అంతేనా ఏయ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఎవరైనా అడ్డొస్తే కబడ్ధార్ అంటూ వార్నింగ్ ఇచ్చేశాడు. తెలుగుదేశం నేతలు కొందరు సినిమా విడుదల ఆపాలని వర్మపై కేసులు పెట్టిన నేపథ్యంలో వర్మ చేసిన ఈ ట్వీట్ ఎటు దారితీస్తుందో మరి.