HomeTelugu Trendingఫస్ట్‌ లవ్‌ని పరిచయం చేసిన ఆర్జీవీ

ఫస్ట్‌ లవ్‌ని పరిచయం చేసిన ఆర్జీవీ

Ram gopal varma shares his
వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా తన ఫస్ట్‌ లవర్‌ను పరిచయం చేస్తూ ఆమె ఫొటో షేర్‌ చేశాడు. అయితే కమిట్‌మెంట్‌ లేని బంధాలకు ప్రాధాన్యత ఇచ్చే ఆర్జీవీ ఇలా తన తొలిప్రేమను పరిచయం చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అతిలోకసుందరి, దివంగత నటి శ్రీదేవి తన క్రష్‌ అని చెప్పుకొచ్చిన వర్మ కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆమె పేరు పోలవరపు సత్య అని, ఆమె మెడిసిన్‌ చేసినట్లు తెలిపాడు.

కాగా విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ ఆర్జీవీ బిటెక్‌ చదివిన విషయం తెలిసిందే. అదే క్యాంపస్‌లో సిద్దార్థ మెడికల్‌ కాలేజీలో సత్య మెడిసిన్‌ చేసిందని చెప్పాడు. అవి రెండు క్యాంపస్‌లు ఒకేచోట ఉండటంతో రోజు సత్యను చూసేవాడినని, అలా తనతో ప్రేమలో పడిపోయినట్లు చెప్పాడు. కానీ ఆమె డబ్బు ఉన్న మరో వ్యక్తితో ప్రేమలో ఉన్న కారణంగా తనని పట్టించుకునేది కాదనే భావనలో ఉండేవాడినన్నాడు. అలా ‘రంగీలా’ మూవీ స్టోరీ పుట్టిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం సత్య అమెరికాలో మెటర్నిటీ డాక్టర్‌గా పని చేస్తున్నట్లు వర్మ చెప్పాడు. అంతేగాక బీచ్‌ తీరాన స్విమ్‌సూట్‌లో ఉన్న ఆమె ఫొటోలను తన వరుస ట్వీట్‌లలో షేర్‌ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!