నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది.. మహేశ్‌ బాబు ఎమోషనల్‌ ట్వీట్‌

ఈరోజు (ఏప్రిల్ 20) సూపర్ స్టార్ మహేశ్‌ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టిన రోజు సందర్భంగా విషెష్ అందించారు మహేష్ బాబు. సోషల్ మీడియా వేదికగా తన తల్లి ఫొటోను షేర్ చేస్తూ.. ఎమోషనల్ మెసేజ్‌ను మహేశ్‌ అభిమానులతో పంచుకున్నారు. ‘ఏప్రిల్ 20 నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈ రోజు మా అమ్మపుట్టిన రోజు. హ్యాపీ బర్త్ డే అమ్మా’ అంటూ ఇందిరా దేవి ఫొటోను షేర్ చేశారు.

కాగా.. గత ఏడాది మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న తన తల్లి పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో ఎమోషనల్ మెసేజ్‌తో పాటు అంజలీ దేవి అరుదైన చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు మహేశ్‌.

‘భరత్ అనే నేను’ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైనదని.. ఎందుకంటే ఈ చిత్రం తన తల్లి జన్మదినం రోజున విడుదల కావడం చాలా ఆనందంగా ఉందంటూ ప్రేక్షకులతో తన అనుభూతిని పంచుకున్నారు.

ఈ సందర్భంగా మహేష్ తల్లి ఇందిర దేవి అపురూపమైన ఫోటోని ట్విట్టర్‌‌లో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే అమ్మా.. ‘భరత్ అనే నేను’ ఇన్ సినిమాస్ నౌ’.. ‘ఈ ప్రత్యేకమైన రోజున నా హృదయానికి దగ్గరైన సినిమాను అందరి ముందుకు తీసుకురావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది అంటూ మహేశ్‌ చేసిన ఎమోషనల్ ట్వీట్ గత ఏడాది వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

ఇక మహేశ్‌ బాబు సినిమా విషయానికి వస్తే.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి’ మూవీ మే9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మహేశ్‌ సరసన పూజా హెగ్డే నటించగా.. అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు.