Homeతెలుగు Newsరాములమ్మను బిజెపి వాడుకోవడం లేదా? విజయశాంతిని బిఆర్ఎస్ టార్గెట్ చేస్తోందా?

రాములమ్మను బిజెపి వాడుకోవడం లేదా? విజయశాంతిని బిఆర్ఎస్ టార్గెట్ చేస్తోందా?

Ramulamma is not being used by BJP Is Vijayashanti being targeted by BRS

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సీఎం కేసీఆర్ కుమార్ కవిత తప్ప మరొక బలమైన మహిళ నేత పేరు కనపడడం లేదు. వినపడడం లేదు. ఆమె చుట్టూ రాజకీయం నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులు కవిత పేరు ప్రముఖంగా నిలిచింది. తెలంగాణలో ఆమె తప్ప మరొక మహిళా నేత లేరని చెప్పడం లేదు. కెసిఆర్ ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఉన్నారు. కానీ, బలమైన వాయిస్ వినిపించే లేడీ పొలిటీషియన్లు కరువయ్యారు. ప్రతిపక్ష పార్టీలలో మహిళా నేతల పేర్లు తక్కువ వినబడుతున్నాయి.

తెలంగాణలో బలమైన వాగ్ధాటి కల మహిళా నేతగా విజయశాంతిని చెప్పుకోవచ్చు.‌ రాష్ట్ర రాజకీయాలకు సినీ గ్రామర్ నేర్పారామె. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపితో విజయశాంతి రాజకీయ ప్రయాణం మొదలైంది. తరువాత టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అడుగులు వేశారు. ఆ తర్వాత మళ్లీ బిజెపిలో చేరారు. ఇప్పుడు ఆమె బిజెపిలో ఉన్నట్టా? లేనట్టా? చాలా మందికి సందేహం కలుగుతూ ఉంటుంది.

విజయశాంతి రాజకీయ అడుగులు నెమ్మదించాయి. తెలంగాణ రాష్ట్ర బిజెపిలో బండి సంజయ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇతర నేతలు దూసుకుంటూ వెళుతుంటే విజయశాంతి అడపాదడపా రాజకీయ తెరపైకి వస్తున్నారు. ఆమె సేవలను బిజెపి సరిగా ఉపయోగించుకోవడం లేదా? లేదంటే విజయశాంతి క్రియాశీలకంగా వ్యవహరించడం లేదా? అనేది బిజెపి పెద్దలకే ఎరుక. అయితే, అప్పుడప్పుడు బిజెపిని విజయశాంతి వీడుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది.

బిజెపిని విజయశాంతి వేడుతారన్న వార్తలు వినిపించిన ప్రతిసారి ఆమె ఖండిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బిజెపితో దూరం వెళ్లి పోవాల్సిన బేధాభిప్రాయాలు తనకేమీ లేవని గత ఏడాది అక్టోబర్ లో ఆమె స్పష్టం చేశారు. ఇటువంటి ప్రచారం వెనక భారతీయ రాష్ట్ర సమితి ఉందని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. తాజాగా మరోసారి బిజెపికి విజయశాంతి దూరమవుతున్నారని ప్రచారం జరిగింది. దానిని కూడా ఆమె ఖడించారు. పార్టీతో తనకు భేదాభిప్రాయాలు ఉన్నవని సోషల్ మీడియాలో ప్రచారం చేసేటోళ్లకు అవి సరైనదో కాదో తెలియాలని పేర్కొన్నారు. తాను కాశీలో ఉన్నానని చెప్పుకొచ్చారు. విజయశాంతిని టార్గెట్ చేయడం వల్ల ప్రయోజనం ఎవరికి ఉంటుందంటారు? ఆలోచించండి!

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu