వరుణ్ తేజ్‌ సినిమాలో రమ్యకృష్ణ

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత వరుణ్ బాక్సింగ్ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఇందులో శివగామిని ఓ కీలక పాత్ర చేస్తున్నది. అలానే బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి మరో కీలక పాత్ర చేస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభం అయ్యింది. ఇండియా వైజ్ గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.