400 గిరిజన కుటుంబాల‌కు సాయం చేసేన రానా


కరోనా కారణంగా ఇబ్బందులు ప‌డుతున్న వారికి సాయం చేసేందుకు ఇప్పటికే పులువురు సెల‌బ్రిటీలు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ యాక్ట‌ర్ రానా కోవిడ్ స‌మ‌యంలో త‌న వంతు సాయంగా పేద‌ల‌కు స‌రుకులు అంద‌జేశారు. నిర్మిల్ జిల్లాలోని గిరిజ‌న గ్రామవాసులకు రానా టీం నిత్యావ‌స‌ర వ‌స్తువులు పంపిణీ చేసింది. 400 కుటుంబాల‌కు అవ‌స‌ర‌మైన స‌రుకులు, మందుల‌ను పంపిణీ చేశారు.

క‌రోనా, లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఈ గ్రామాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రానా ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ల్యాణ్ తో అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ రీమేక్ లో న‌టిస్తున్నాడు. సాగ‌ర్ చంద్ర డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ మూవీ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. మ‌రోవైపు వేణు ఊడుగుల డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన విరాట‌ప‌ర్వం విడుద‌లకు సిద్ద‌మైంది.

CLICK HERE!! For the aha Latest Updates