రష్యా సినిమాలో దగ్గుబాటి హీరో!

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో దగ్గుబాటి రానా ఒకరు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విలక్షణమైన పాత్రలను ఎన్నుకుంటూ నటిస్తోన్న రాణా త్వరలోనే ఓ రష్యా సినిమా చేయనున్నాడని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రానా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. రష్యా సినిమాలో అవకాశం వచ్చిందనీ.. తన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండడంతో అంగీకరించానని చెప్పారు. ఆ సినిమాకు సంబంధించిన
పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తానని అన్నారు.

రష్యా సినిమాలే కాకుండా ఇరాన్ వంటి విదేశీ బాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయని, వాటి విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని అన్నారు. మొత్తానికి బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ కు రానాకు విదేశీ భాషల్లో కూడా అవకాశాలు వచ్చేలా చేస్తుంది. ఇప్పటివరకు రెండు, మూడు భాషలకే పరిమితమైన రానా ఇక నేషనల్ వైడ్ గా తన క్రేజ్ ను విస్తరిస్తాడేమో చూడాలి!