మరో వైవిధ్యమైన పాత్రలో రానా..!

హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందుతోన్న దగ్గుబాటి రానా ప్రస్తుతం ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. తేజ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రానా రాజకీయనాయకుడిగా కనిపించనున్నాడని టాక్. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఈ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కన్నడ దర్శకుడు ఏ.ఎం.ఆర్.రమేష్ ఓ థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాఊ. రాజీవ్ గాంధీ హత్య నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు.

ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందించాలనేది దర్శకనిర్మాతల ప్లాన్. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర సీబీఐ ఆఫీసర్ డి.ఆర్.కార్తికేయన్ పాత్ర కోసం రానాను సంప్రదించారట. ప్రస్తుతం రానాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ రోల్ ఆఫర్ చేసినట్లు టాక్. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉండడంతో రానా ఈ సినిమాకు ఓకే చెప్పారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రావాల్సివుంది.