HomeTelugu Trending'రంగమార్తాండ': చిరు కవితాఝరి

‘రంగమార్తాండ’: చిరు కవితాఝరి

Rangamarthanda update
క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వం వస్తున్న తాజా చిత్రం ‘రంగమార్తాండ’. లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా అప్డేట్‌ అందించారు డైరెక్టర్ కృష్ణవంశీ. ఈ సినిమా కోసం మెగాస్టార్‌ చిరంజీవి షాయరీ (కవితాఝరి) అందించబోతున్నాడు. స్నేహితులు, శ్రేయోభిలాషులకు హాయ్‌.. చాలా కాలంగా ఉన్న ఎదురుచూపులకు శుభం పడనుంది. గర్వంగా సమర్పిస్తున్నా..నా సినిమా రంగమార్తాండ కోసం అన్నయ్య షాయరీ.. మీరంతా ఇష్టపడతారని ఆశిస్తున్నానని ట్వీట్ చేస్తూ.. చిరు కవితాఝరి పలుకుతున్న స్టిల్‌ను షేర్ చేశాడు కృష్ణవంశీ.

నేనొక నటుడిని అంటూ సాగే షాయరీని డిసెంబర్‌ 21న ఉదయం 11 : 07కు లాంఛ్ చేస్తున్నట్టు కృష్ణవంశీ ప్రకటించాడు.ఎమోషనల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హౌస్‌ఫుల్‌ మూవీస్‌-రాజ శ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రంగమార్తాండ సినిమాకు సంబంధించి విడుదలైయ్యాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!