HomeTelugu Trendingవెండితెరపై సుధీర్‌తో రష్మీ రొమాన్స్‌.!

వెండితెరపై సుధీర్‌తో రష్మీ రొమాన్స్‌.!

5 4
బుల్లితెరపై ‘సుడిగాలి’ సుధీర్, రష్మీ జంటకు మంచి క్రేజ్‌ ఉంది. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఈ జోడీ ఇంతటి పాపులరీటి సంపాందించుకుందో తెలిసిందే. వీళ్లిద్దరి క్రెమిస్ట్రీ ఆ రెంజ్‌ లో ఉంటుంది మరీ.. అయితే ఈ ఇద్దరినీ కలిసి వెండితెరపై చూడటానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ల కోరిక త్వరలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇటీవల కాలంలో సుధీర్ హీరోగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి శేఖర్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఆ సినిమా సమయంలోనే తరువాత సుధీర్,రష్మీ జోడీగా ఒక సినిమా చేయాలనుందని అన్నాడు. ఆయనే ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ను చేయడానికి రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ఇక వెండితెరపై ఈ ఇద్దరూ కలిసి చేసే సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu