సూర్యతో రష్మిక!


తమిళ ప్రముఖ నటుడు సూర్య నటిస్తున్న చిత్రం ‘సూరరై పోట్రు’. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో తెరపైకి రానుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత హరి దర్శకత్వంలో సూర్య ఓచిత్రంలో నటించనున్నారు. ఎప్పటిలాగే తనదైన మాస్‌, యాక్షన్‌ చిత్రంగా దీనిని తెరకెక్కించనున్నారు హరి. ఈ చిత్రంలో ‘మాస్టర్‌’ ఫేమ్‌ మాళవిక నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆమె స్థానంలో రష్మిక చేరినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే చర్చలు కూడా జరిగాయని సమాచారం. ప్రస్తుతం సూర్య సోదరుడు కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘సుల్తాన్‌’ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది . త్వరలో కార్తి అన్నతోనూ ఈ అమ్మడు జతకట్టనుందని తెలుస్తుంది.