రవితేజ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..?

రవితేజ ‘బెంగాల్ టైగర్’ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని రెండు సినిమాలు ఓకే చేశాడు. రెండు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ అనే సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఒక సాంగ్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారు. పాండిచ్చేరి నేపధ్యంలో తెరకెక్కబోయే సినిమా కావడంతో షూటింగ్ కూడా ఎక్కువ శాతం అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక కథానాయికగా రాశిఖన్నాను ఎంపిక చేసుకున్నారు.

మరో హీరోయిన్ కు ఈ సినిమాలో స్థానం ఉంది. రవితేజ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ కనిపించబోతున్నాడని సమాచారం. గతంలో పోలీస్ ఆఫీసర్ గా ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాయి. అదే సెంటిమెంట్ ను ఈ సినిమాకు కూడా రిపీట్ చేస్తున్నాడు ఈ మాస్ హీరో. మరి ఈ సినిమా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.. చూడాలి!