మెగా ఫోన్ పట్టనున్న మాస్ హీరో..?

గతేడాది రవితేజ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. దీనిపట్ల ఆయన అభిమానులు నిరాశ చెందారనే చెప్పాలి. దీంతో వారిని ఉత్తేజ పరచాలనే ఉద్దేశంతో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాల తరువాత రవితేజ ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఆయన మాత్రం దర్శకత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

నటుడు కాకముందు రవితేజ కొంత కాలం పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. ఆ అనుభవంతోనే దర్శకుడిగా తన సత్తా చూపించడానికి రెడీ అయిపోతున్నాడట ఈ మాస్ మహారాజ. మరి రవితేజ పూర్తిగా దర్శకత్వం వైపు ఉండిపోతాడా..? లేక తీరిక చూసుకొని సినిమాల్లో కూడా నటిస్తాడా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది!