HomeTelugu Trendingపవన్ కళ్యాణ్ సినిమాలో రేణు దేశాయ్‌?

పవన్ కళ్యాణ్ సినిమాలో రేణు దేశాయ్‌?

1 27

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్.. అభిమానుల కోరిక మేరకు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమా రీమేక్ లో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని. ఈ సినిమాలో ఒక పిల్లవాడి తల్లి పాత్రలో రేణు కనిపించనున్నారని తెలుస్తుంది. తల్లి పాత్రలు చేయడానికైనా సిద్ధమేనని గతంలో రేణు స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పవన్ సినిమాలో చేసేందుకు రేణుని ఒప్పించే పనిలో ఉన్నాడంట దర్శకుడు. మరి రేణు దేశాయ్ ఒప్పికుంటారో ..లేదో చూడాలి. గతంలో ఇద్దరు బద్రి, జానీ సినిమాల్లో నటించారు. ఏది ఏమైనా పవన్ రేణు దేశాయ్ లు కలిసి ఇన్నాళ్ల తర్వాత ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నదనే తెలియాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరుకూ వేచిచూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!